* ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు విచ్చేస్తున్న రాజకీయ ప్రముఖులు
* అతిథుల కోసం 150 రకాల వంటకాలు
* రాజకీయాలకు అతీతంగా అలయ్-బలయ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exibhition Ground)లో అలయ్ – బలయ్(Alay-Balay) సందడి మొదలైంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Governor Bandaru dathatreya) 19 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి(Vijayalaxmi) ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కొనసాగిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక కళా బృందాలు అథితులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటికే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Mp Kondea Vishveswar Reddy) తదితరులు విచ్చేశారు. డప్పు విన్యాసాలు, కోయ డ్యాన్సులు, బుడగ జంగాలు తదితర కళారూపాలు ఆకట్టుకుంటున్నాయి. నిర్వాహకులు అతిథుల కోసం 150 రకాల వంటకాలను సిద్ధం చేశారు. అలాగే ప్రాంగణంలో తెలంగాణ వృత్తుల స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఏటా సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపగా, ఈసారి కేవలం రాజకీయ ప్రముఖులకే ఈ కార్యక్రమం పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
