ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 9గంటల నుండి భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రaా ఒక ప్రకటనలో తెలిపారు. మెడికోవర్ హాస్పటల్ చెందిన ప్రముఖ వైద్య నిపుణులుతో పాటు శరత్ ఐ హాస్పిటల్‌కు చెందిన కంటి వైద్యుల ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డ్స్ వారి కుటుంబం సభ్యులకు అలాగే పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడుతాయి. కావున పోలీస్ సిబ్బంది అధికసంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
