* హైదరాబాద్ మియాపూర్లో చిరుత సంచారాన్ని కొట్టిపారేసిన అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(HYDERABAD)లోని మియాపూర్ మెట్రోరైల్వే స్టేషన్ వద్ద చిరుత(CHIRUTHA) సంచారం చేస్తోందని నిన్న ఓ వీడియో వైరల్ గా మారింది. నగర నడిబొడ్డున చిరుత సంచారం వార్త దావానలంలా వ్యాపించింది. ఓ అపార్టమెంట్ నిర్మానుష్య ప్రాంతంలో సంచరిస్తూ కనిపించి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మియాపూర్ మెట్రో స్టేషన్(MIYAPUR METRO STATION) పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నది చిరుత కాదు అడవి పిల్లి(FOREST CAT) అని నిర్ధారించారు. కాలి ముద్రలు 3.5 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నాయని, చిరుత పులి కాలి ముద్ర కనీసం 7 సెంటీమీటర్లు ఉంటుందని శంషాబాద్ డీఎఫ్ఓ విజయానంద్ రావు(DFO VIJAYANANDH) తెలిపారు. సెల్ ఫోన్ లో జూమ్ చేసి తీయడం వల్ల పులిలాగా కనిపించిందన్నారు. అది పులి కాదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
