ఆకేరున్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం ప్రియుడు వీరభద్రం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు. గతంలో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఓ జంట దగ్గర నుండి స్వాతి- వీరభద్రం రూ. 16 లక్షలు తీసుకొని మోసం చేశారు. ఆ 16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రంకు మధ్య విబేధాలతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు వీరభద్రం దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి పొలంలో పూడ్చిపెట్టాడు. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు వీరభద్రంపై అనుమానం రావడంతో విచారణలో వీరభద్రం నిజం ఒప్పుకున్నాడు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
