Mahabubabad Snakebite Death Incident
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: తొర్రూరు మండలం సోమవరపుకుంట తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) పాము కాటుతో గురువారం మృతి చెందాడు.
బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో కట్లపాము కాటు వేయగా, ప్రవీణ్ నిర్లక్ష్యంతో ఆస్పత్రికి వెళ్లలేదు. తెల్లవారుజామున వాంతులు, విరోచనాలు కావడం, పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు.
మృతుడికి భార్య మమత, తల్లి రంగమ్మ ఉన్నారు. అతని ఆకస్మిక మరణంతో తండాలో శోకఛాయలు అలముకున్నాయి.
