PM Modi Fast Track Courts for Paper Leak Cases
ఆకేరు న్యూస్, కమలాపూర్:
పేపర్ లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితంగా కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశ యువత సంక్షేమానికి, వారి భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, అభ్యర్థుల హక్కులను పరిరక్షించే క్రమంలో ఈ నిర్ణయం ఒక కీలక అడుగని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఇంగ్లీషు, హిందీలో రాసిన పోస్ట్‌లో, యువత భవిష్యత్తుతో చేసే ఏ విధమైన మోసాన్నీ సహించేది లేదు. విద్యార్థుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
ఇటీవల పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు అభ్యర్థులలో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నేపథ్యంలో, సంబంధిత శాఖలకు తక్షణ చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ జాప్యాన్ని నివారించి పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు తిరిగి పూర్తి విశ్వాసాన్ని పెంపొందించాలని భావిస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
