Adarsha Kutumbam
Adarsha Kutumbam| ఆకేరు న్యూస్, సినిమా: విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
‘నారాయణమ్మ’ పాట విడుదల
‘ఆదర్శ కుటుంబం’ నుంచి తొలి పాట నారాయణమ్మను నేడు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని హోటల్ దాస్పల్లాలో సాయంత్రం 5 గంటల తర్వాత పాటను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుకానుంది.
భారీ తారాగణం
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
