* సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండిసంజయ్ లేఖ రాశారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉందని..
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటని.. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బ్జడెట్లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా.. నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణమని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే అమలు చేయలేకపోతే.. మీ నేతృత్వంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పనిచేయగలరు?. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైంది. ఇకనైనా అర్హులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలని లేఖలో పేర్కొన్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
