నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
* నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఆకేరు న్యూస్, నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా, వెనుక నుంచి ఓ కారును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
