* వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్: విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా.. క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు పోలీస్ క్రీడాకారులు క్రీడా ప్రదర్శన స్పూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ మూడవ స్పోర్ట్ అండ్ గేమ్స్ మీట్ 2025ను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. నేటినుండి మూడు రోజుల పాటు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోలీస్ క్రీడల్లో తోలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హజరయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ను నిర్వహించగా, క్రీడలు నిర్వహిస్తున్న మైదానంలో పోలీస్ కమిషనర్ క్రీడా జెండాను ఎగురవేయడంతో పాటు, అకాశంలోకి పావురాలను, బెలూల్లను ఎగురవేయడగా పోలీస్ క్రీడాకారులు తీసుకవచ్చిన క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్‌కు అందజేసారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్బంగా పురుషుల, మహిళలకు ఎర్పాటు చేసిన ఎనిమిది వందల మీటర్ల పరుగు పోటీలతో , వాలీబాల్ క్రీడలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా ఈ క్రీడల్లో ఉత్సహంగా పాల్గోన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వహణాధికారులను పోలీస్ కమిషనర్ అభినందనలు తెలుపుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన మూడు జోన్లతో పాటు మొత్తం ఆరు జట్లు 12 క్రీడాంశాల్లో పోలీస్ క్రీడాకారులు పోటీ పడుతారని. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గోనాల్సి వుంటుందని. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, మీరు క్రీడల్లో ప్రతిభ కనబరిచారో ముఖ్యమని. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దారుధ్యం పెరగడంతో పాటు, పనిఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా వుంటారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు రవీందర్, రాజమహేంద్రనాయక్, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్, జనగామ ఏఎస్పి పండరీ చేతన్ నితిన్‌తో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఎస్.ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
