* రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ పోలీసుల ఆందోళనలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకు:ది. ఇందులో భాగంగానే 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయగా.. డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణ శాఖలో పనిచేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడిరచారు. ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం చర్యలపై బెటాలియన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే
సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లు వీరే..
సస్పెన్షన్‌కు గురైన వారిలో 3వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 4వ బెటాలియన్‌లో ఆరుగురు, 5వ బెటాలియన్‌లో ఆరుగురు, 6వ బెటాలియన్‌లో ఐదుగురు, 12వ బెటాలియన్‌లో ఐదుగురు, 13వ బెటాలియన్‌లో ఐదుగురు, 17వ బెటాలియన్‌లో ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
