ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో గడిపిన మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న బెయిల్ అనంతరం విడుదల కానున్నారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు చెరిపేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అనే అభియోగాలు కూడా ఉన్నాయి. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్పీ భుజంగ రావ్, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు 10 నెలలకు పైగా జైల్లోనే ఉన్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
