Kamalaapur Tiranga Bike Rally
ఆకేరు న్యూస్, కమలాపూర్:
దేశభక్తిని శిఖరాలకు చేర్చేలా కమలాపూర్ మండలంలో జాతీయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ మార్మోగింది. మండల బీజేపీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్ఓబి బ్రిడ్జి నుంచి కమలాపూర్ అంబేద్కర్ విగ్రహం వరకు హుజురాబాద్ – పరకాల ప్రధాన రహదారి పై 5 కిలో మీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా మండల ప్రబారి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జాతీయ జెండాలు చేబూని, భారత్ మాతా కీ జై నినాదాలతో రహదారులు మార్మోగాయి. అనంతరం మండలాధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 80 ఏండ్ల స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు, దేశ ప్రజల ఐక్యతను చాటేందుకు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. దేశ సమైక్యతను, ఐక్యతను కాపాడుకోవడానికి భారతీయులందరూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే నినాదంతో ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంపై అనేక కుట్రలు జరుగుతున్నప్పటికీ, దేశ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒకే తాటిపై నిలబడి ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
