* రాహుల్ మాట మేరకు తెలంగాణలో విజయవంతం
* ఏఐసీసీ సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy) అన్నారు. సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, దళితులకు, ఆదివాసులకు భూ చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. భారత్ జోడోయాత్ర పేరిట రాహుల్‌గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులు తెలుసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు గాంధీ పరివార్ ఉందని.. రాహుల్ గాంధీకి అండగా తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా కులగణన చేపట్టిందని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సర్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలున్నాయని.. ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించి కులగణన చేపట్టినట్లు తెలిపారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
