Ekashila Park Walkers Association
* ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్‌గా ఎంపికైన
ఆకేరు న్యూస్,హన్మకొండ:
ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్‌గా ఇటీవల నియమితులైన చాడా దశరథం రెడ్డిని మన పరపతి సంఘం మరియు ఏకశిలా పార్క్ వాకర్స్ సభ్యులు ఈరోజు ఏకశిలా పార్క్‌లో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో మన పరపతి సంఘం వ్యవస్థాపకులు బైరి (కత్తి)సోమన్న, అధ్యక్షులు బైరి సాంబన్న, కోశాధికారి భగవాన్ రెడ్డి, ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల సోమయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వీరస్వామి, సీనియర్ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు కుందారపు యాదగిరి, మరియు ప్రతినిధులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు గజమాల వేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చాడా దశరథం రెడ్డి సీనియర్ నాయకుడిగా, మార్గదర్శకుడిగా వాకర్స్ అసోసియేషన్‌కు అందించిన సేవలు అభినందనీయమని, చీఫ్ అడ్వైజర్‌గా ఆయన అనుభవం అసోసియేషన్ మరింత ముందుకు వెళ్లడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం చాడా దశరథం రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో చీఫ్ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు, ఈరోజు ఇంత ఘనంగా సన్మానించిన మన పరపతి సంఘం ప్రతినిధులకు మరియు పార్క్ వాకర్స్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏకశిలా పార్క్ అభివృద్ధికి, వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరియు సభ్యుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మన పరపతి సంఘం సభ్యులు, ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ వాకర్లు మరియు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
