Station Ghanpur
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పోషణ మాసోత్సవాన్ని నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు, పిల్లలకు అందించాల్సిన పోషకాహారం, ప్రీస్కూల్ విద్య అవసరంపై అంగన్వాడీ సిబ్బంది వివరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని సూచించారు.
ఈ సందర్భంగా ఆకుకూరలు, పండ్లు, పాలు తదితర పోషక పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలపై తల్లులకు వివరించారు. ప్రదర్శన తల్లులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏసీడీపీఓ శోభారాణి, అంగన్వాడీ టీచర్లు అరుణ, తిరుమల, రమ, జయలక్ష్మి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
