Mulugu Electric Shock
* ములుగు జిల్లాలో విషాద ఘటన
* మిర్చి తోటలో విద్యుత్ ప్రమాదం
ఆకేరు న్యూస్, ములుగు: వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో చోటుచేసుకుంది.
మిర్చి తోటలో మాల్చింగ్ షీట్ వేసేందుకు వెళ్లిన రైతులు పనులు చేస్తుండగా.. పొలంలోని మోటార్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఐరన్ ఫెన్సింగ్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగలగా.. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తికి కూడా షాక్ తగిలింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం.
వెంటనే స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
