
* మడికొండలో జనజాతర సభ
* భారీ ఏర్పాట్లు
ఆకేరు న్యూస్ , వరంగల్ : నేడు హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మడికొండ శివారు ప్రాంతంలో ఈనాడు ఆఫీస్ ఎదురుగా జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు,ప్రజలు ఈ సభకు హాజరవుతారు. భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల , భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి ప్రజలను కదిలిస్తున్నారు. లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ఈ సభకు జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు హాజరవుతారని కడియం శ్రీహరి తెలిపారు. కాగా బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పరిశీలించారు.
—————————