CM Revanth Reddy Serious On MLAs
* అవసరమైతే ఇంచార్జీ మంత్రులను కూడా మార్చేస్తాం
ఆకేరు న్యూస్, హైదరాబాద్
* సర్ .. అవగాహనా సమావేశాల ఏర్పాటులో ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అని మండి పడ్డారు. సర్ ప్రక్రియ పై తీసుకోవాల్సిన చర్యలకు సంబందించి ఎమ్మెల్యేలు, మంత్రులతో జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అద్యక్షుడు మహేశ్ కు మార్ గౌడ్ సీఎం ఎమ్మెల్యేల వైఖరిపై సీరియస్ అయ్యారు. బీఆర్ ఎస్ , బీజేపీలు మనకంటే చాలా ముందున్నాయన్నారు.. అధికారంలో ఉన్న మనం చొరవ ఎక్కు వ తీసుకోవాలి కదా అని అన్నారు. ప్రతీ ఓటు ఎంతో ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. లౌకిక వాదులతో పాటు ఇతర ప్రత్యేక వర్గాల ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అదే విదంగా కొంత మంది ఇంచార్జీ మంత్రులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. పని విదానం మార్చుకోక పోతే వారిని కూడా మార్చేస్తాం అని సీఎం హెచ్చరించారు
————————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
