Published:
Updated: 27 Jan 2025 • 04:28 AM
* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరంగల్ (Warangal) మామునూర్ హైవేపై అదుపుతప్పిన ఓ లారీ ఆటోలపై దూసుకెళ్లడంతో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న ఆటోలపై పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
………………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
