ఆకేరు న్యూస్ డెస్క్ : మావోయిస్టులు – భద్రతా దళాల మధ్య కాల్పులు(Encounter) కొనసాగుతూనే ఉన్నాయి. చత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు (Chhattisgarh – Odisha Border) ప్రాంతంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈసారి కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న భద్రతాబలగాలకు సునాబేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువైపులా కాల్పులు ప్రారంభించడంతో.. ఒడిశా సుప్పాడ జిల్లా స్పెషల్ ఆపరేషన్ గ్రూపుకు చెందిన ప్రకాష్ సాయి అనే మరొక జవాన్‌కు బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ అతని మెడలో ఇరుక్కుపోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాయపడిన జవాన్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎన్నికలకు ముందు జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచీ అడపాదడపా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
————————-