
ఛత్తీస్గఢ్ కబీర్ ధామ్ జిల్లా కవర్దా ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిన వ్యాను
ఆకేరు న్యూస్ డెస్క్ : ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 17 మంది దుర్మరణం చెందారు. కబీర్ ధామ్ జిల్లాలోని కవర్దా ప్రాంతంలో భారీ లోయలో ఓ వ్యాను పడిపోయింది. వ్యానులో ఉన్న వారిలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల్లో 14 మంది మహిళలే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
——————-