BANDI SANJAY | బీఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టే ప్రసక్తే లేదు
* ఆ రెండు పార్టీలూ దొందూ దొందే
* ఇచ్చిన హామీలను ఎవరూ నెరవేర్చలేదు
* 2028లో తెలంగాణలో అధికారం బీజేపీదే
* హైడ్రాతో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం
* సకలం చెరువు ఆక్రమణలపై మాట్లాడరేం?
* కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్(BJP MP BANDI SANJAY) హెచ్చరించారు. బీఆర్ ఎస్(BRS), కాంగ్రెస్(CONGRESS) రెండు పార్టీలూ ఒక్కటే అని, ఇచ్చిన హామీలను ఎవరూ నెరవేర్చలేదని విమర్శించారు. 2028లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయే అని చెప్పారు. హైదరాబాద్ నాగోలులో నిర్వహించిన బీజేపీ(BJP) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాదని చెప్పారు. అనేక మంది రైతులు, బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. కొట్లాడి ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. 2028లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని, రామరాజ్యం(RAMARAJYAM) తెస్తామని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీకి వేయాల్సిన ఓట్లను కాంగ్రెస్ కు వేసి పొరపాటు చేశామని ప్రజలు భావించారని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారని చెప్పారు.