* రైతు మహోత్సవానికి తరలిన
* స్టేషన్ ఘన్ పూర్ రైతులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల రైతులు తరలివెళ్లారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో శుక్రవారం రైతులు నర్మెట్టకు తరలివెళ్లారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి చంద్రన్కుమార్ మాట్లాడుతూ ఈ మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు అన్నారు. రైతుల అభివృద్ధిని లక్ష్యంగా ఈ మహోత్సవంలో సుమారు 150 ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ పంటల సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేస్తున్నారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలతో నేరుగా చర్చించే ఇష్ట గోష్టి ఏర్పాటు చేయడంతో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది అన్నారు. అలాగే ఆయిల్ పామ్ సాగు, దిగుబడి, లాభదాయకత, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించింది అన్నారు. ఈ రైతు మహోత్సవం ద్వారా రైతుల్లో నూతన సాగు పద్ధతులపై అవగాహన పెంపొందిం చడం, ఆధునిక సాంకేతికత, అధిక దిగుబ డులు సాధించేందుకు మార్గనిర్దేశం చేయడం ప్రధాన లక్ష్యమని ఏవో చంద్రం కుమార్ తెలిపారు. పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
