
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు
* తమిళనాడు బాణసంచా దుకాణంలో పేలుడు ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. నలుగురు సజీవదహనం అయ్యారు. విరుదునగర్ (Virudhunagar) జిల్లా సత్తూరు సమీపంలో ఉన్న బాణాసంచా కర్మాగారంలో (Firecracker Factory) శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు విరుదునగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
—————