GMPS Martyrs Inspiration Yatra
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (GMPS) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర” మూడో రోజు సోమవారం జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా చిల్పూర్ గ్రామానికి చెందిన అమరుడు ‘జంగం (పాల) కొమురయ్య’ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ, “జంగం కొమురయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పని చేశారు. ఉమ్మడి స్టేషన్ ఘన్ పూర్ మండలంలో గొల్లకురుమలను ఐక్యం చేసి, సొసైటీల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సేవలు సంఘానికి ఎంతో ఉపయోగపడ్డాయి అని కొనియాడారు. చిల్పూర్ లోని గొల్లకురుమలు గొర్రెలు, మేకలు మేయడం కోసం ప్రభుత్వం 4 ఎకరాల భూమి ఇస్తే, అందులో మూగజీవాలకు నీళ్లు తాగడానికి బోర్లు వేయించిన ఘనత కొమురన్నదే అన్నారు.
ఈ గ్రామంలోని గొల్లకురుమల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉందాం” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, రాష్ట్ర నాయకులు చల్ల మల్లయ్య, కడెం లింగయ్య, సాదం రమేష్, జంగం సాంబరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్ల రాజ్ కుమార్, మండల అధ్యక్షులు డోకి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఆవుల ప్రభాకర్, ఆవుల లింగయ్య, బోడ రాజయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
