పాతబస్తీలో అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ బోనాల సందడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad) లో అంగరంగవైభవంగా బోనాల జాతర కొనసాగుతోంది. పాతబస్తీలోని లాల్ దర్వాజ (Laldarwaja) సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఈరోజు జాతర ప్రారంభమైంది. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతోపాటు అక్కన్న మాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అలయానికి పలువురు మంత్రులతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. నేడు అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. రేపు రంగం సహా అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది. హైదరాబాద్‌లోని 23 ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర కొనసాగుతోంది.
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
