* ఏప్రిల్ 8 నుండి విద్యుత్ ఆర్టిజన్ల రాష్ట్రవ్యాప్త సమ్మె
* హనుమకొండలో టీజీ ఆర్టిజన్ల జేఏసీ ప్రకటన
ఆకేరు న్యూస్, హనుమకొండ (నక్కలగుట్ట): తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వివక్షను నిరసిస్తూ, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు టీజీ ఆర్టిజన్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ రెడ్డి ప్రకటించారు.
మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ (NPDCL కార్యాలయం) వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరియు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు.
నిరసనల కార్యాచరణ ఇదే:
యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. అవుట్సోర్సింగ్ నుండి ఆర్టిజన్లుగా గుర్తింపు పొందిన తమకు, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా దానికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్టిజన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై టీజీ ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 7న మహాధర్నా, ఏప్రిల్ 8 నుండి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హనుమకొండలో ప్రకటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
