Hrithik Roshan
Hrithik Roshan| ఆకేరు న్యూస్, డెస్క్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నటి–సింగర్ సబా ఆజాద్ తమ రిలేషన్‌షిప్‌కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హృతిక్ సోషల్ మీడియాలో సబాతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
మై లవ్ అంటూ..
వెకేషన్ సందర్భంగా తీసుకున్న ఫొటోలను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సముద్ర తీరంలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోతో పాటు, నదీ తీరంలో సెల్ఫీ దిగిన మరో చిత్రాన్ని షేర్ చేశాడు. ఇట్స్ అవర్ బర్త్‌డే. హ్యాపీ 5th మై లవ్ అంటూ సబాకు విషెస్ తెలిపాడు.
సుస్సానే కామెంట్ వైరల్
హృతిక్ పోస్ట్‌కు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అయితే హృతిక్ మాజీ భార్య సుస్సానే ఖాన్ చేసిన కామెంట్ ప్రత్యేకంగా వైరల్‌గా మారింది. సో స్వీట్.. హ్యాపీ యానివర్సరీ” అంటూ ఆమె స్పందించింది. దీంతో సుస్సానే కామెంట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
