KBR Park One Way
* ఏడాదిన్నర పాటు వన్‌వే
* కేబీఆర్ పార్క్ చుట్టూ..
* రేపటి నుంచే అమల్లోకి..
* కొద్దిరోజులుగా అధికారుల కసరత్తు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అది. ప్రముఖుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సిగ్నల్ పడిందంటే చాలు.. కనీసం కిలోమీటరు వాహనాలు బారులుదీరుతాయి. అదే కేబీఆర్ పార్కు – జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు రోడ్డు. ఆ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఆగస్టు 18 నుంచి అక్కడ ఏడాదిన్నర పాటు వన్‌వే అమల్లో ఉండనుంది. కీలకమైన ప్రాంతం.. అందులోనూ ఏడాదిన్నర పాటు వన్ వే ఉండడంతో అధికారులు కొద్దిరోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.
* రూ. 1090 కోట్ల ప్రాజెక్ట్
హెచ్సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. 1090 కోట్ల పనులు చేపడుతున్నారు.కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వేలో వాహనదారులు వెళ్లాలని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ తెలిపారు. కలగకుండా ఉండేందుకు ఒన్ వే చేస్తున్నామని, ఆగస్టు 18 నుంచి అమలులోకి వస్తుందని ఇప్పటికే వెల్లడించారు. ఇందుకోసం రెండు సార్లు నిర్వహించిన ట్రయల్ రన్లో వాహనదారులు ఇచ్చిన సూచనలు, అధికారులు గుర్తించిన విషయాలను అమలు పరుస్తున్నామన్నారు.
* అవగాహన
రేపటి నుంచి వన్‌వేను అమలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇప్పటికే మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, డీసీపీ కాజల్ స్థానిక ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో పాటు కేబీఆర్ పార్క్ వాకర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ విధానంపై వాకర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా క్యూర్ కోడ్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజలు, వాహనదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు-చేర్పులు చేపట్టనున్నారు.
* గంటకు 15,361 వాహనాలు
కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు కారిడార్‌లో జంక్షన్ల వద్ద వాహనాలు బారులు దీరి ఉంటాయి. ఆయా జంక్షన్లలో సగటున గంటకు 5,100 వాహనాల నుంచి 15,361 వాహనాలు వెళ్తాయని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ నెలకొంటున్న ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ పనులు వేగంగా జరగడం కోసం ఈ ఆంక్షలను అధికారులు అమల్లోకి తెచ్చారు.
* వాహనదారులూ గుర్తించుకోండి..
* జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, కేబుల్ బ్రిడ్జి, ఎన్టీఆర్ భవన్ వరకు యూటర్న్లు ఉండవు.
* చెక్‌పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట, బేగంపేట వరకు రెండు లైన్లలో ప్రయాణం చేయవచ్చు,
* చెక్‌పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 10, 12కు వెళ్లే వారు స్టడీ సర్కిల్ వద్ద ఉన్న మీడియం నుంచి వెళాల్సి ఉంటుంది.
* రోడ్ నెంబర్ 12కు వెళ్లే వారి కోసం కేన్సర్ ఆస్పత్రి దాటిన తర్వాత మీడియన్‌ను వినియోగించుకోవాలి
* ఎన్ఎఫ్సీఎల్ నుంచి రోడ్ నెంబర్ 36కు వెళ్లే వాహనదారులు శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి ఇందిరానగర్, వెంకటగిరి, రోడ్ నెంబర్ 10 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* ఫిలింనగర్‌కు వెళ్లే వారు రోడ్ నెంబర్ 51, 52 లగుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
