* కులగణన కమిషన్ కు ఎమ్మెల్యీ కవిత నివేదిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫులే ఫ్రంట్, బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్కు 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్యర్యంలో చేపట్టిన సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు. కులగణన (Caste census) చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
