* ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ యూనివర్సిటీలో ధర్నా
ఆకేరున్యూస్, హన్మకొండ: ‘ఎస్ఆర్’ యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్ యూనివర్సిటీలో ధర్నా చేశారు. ఎస్ఆర్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అధిక ఫీజులు, కండోనేషియన్ ఫీజుల వసూలు చేస్తున్నారని.. వెంటనే ఫీజులు తగ్గించాలని విద్యార్థులతో ధర్నా చేశారు. గత సెమిస్టర్లో కన్ఫర్మేషన్ ఫీజు 500 ఉంటే ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు చేశారని.. ఒకవేళ 60% కన్నా తక్కువ ఉంటే 2000 కంటిన్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఈ ధర్నాలో అనేకమంది యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఫీజులు తగ్గించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగం సమిత్ రెడ్డి, వరంగల్ మహానగర్ కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్, ఎస్ఎఫ్డి వరంగల్ విభాగ్ కన్వీనర్ రావణవేణి రోహిత్, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
