మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
* డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం
* డ్రగ్స్ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
* యువతను దారి మళ్లించేందుకే స్కిల్ యూనివర్సిటీ
* మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
* నల్గొండలో మిషన్ పరివర్తన : జిల్లా ఎస్సీ
ఆకేరు న్యూస్, నల్గొండ : కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, భవిష్యత్ బాగుండాలంటే దాని జోలికి వెళ్లొద్దని యువతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KOMATIREDDY VENKAT REDDY) సూచించారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టి న మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ క్లాక్ టవర్ చేరు కున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డారు. తెలంగాణలో యువత డ్రగ్స్ కు బానిస కాకుండా, మంచి భవిష్యత్ వైపు అడుగులు వేయాలని స్కిల్ యూనివర్సిటీ (SKILL UNIVERSITY) కట్టిస్తున్నామని తెలిపారు. నల్గొండ(NALGONDA)లో నూ 34 కోట్లతో స్కి ల్ సెంటర్ కట్టిస్తున్నామన్నారు. త్వ రలోనే సిఎంతో దీనిని ప్రారంభిస్తామన్నారు. ప్రకాశం బజార్ లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని, డిజిటల్ తరగతుల తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైద్రాబాద్ (HYDERABAD)లో డ్రగ్స్ పై కఠిన చర్యలుతీసుకొం టున్నామని ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP SARATH CHANDRA PAWAR) మాట్లాడుతూ మిషన్ పరివర్తన కింద వారం రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామ ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆదనపు ఎస్పీ రమేష్, డి డబ్ల్యుఓ కృష్ణవేణి, మాజీ మున్సిప ల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.డి ఈ ఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
