Indiramma Houses
* ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు శంకుస్థాపన
* హైదరాబాద్‌లోని పేదలకు గుడ్ న్యూస్
Indiramma Houses| ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వేగవంతమైంది. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామంలోని సర్వే నెం. 346 పరిధిలో, కైసర్‌నగర్ ప్రాంతంలో, ఆక్సిజన్ హోమ్స్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మించనున్న భారీ ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి పొంగులేటి చేతుల మీదుగా..
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కుత్బుల్లాపూర్ స్థానిక శాసనసభ్యులు కె.పి. వివేకానంద ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అత్యంత ఆధునిక హంగులతో చేపట్టబోయే ఈ టవర్ల నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి, శరవేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నిరుపేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ మద్దతుతో నాణ్యమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన శాశ్వత గృహాలను అందించాలనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు టవర్ల నిర్మాణం ద్వారా నగర శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని, అన్ని మౌలిక వసతులతో ఈ సముదాయాలను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, గృహనిర్మాణ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
