Home Guard Recruitment
* ఉద్యోగం కోసం అసాధారణ ప్రయత్నం..
* జార్ఖండ్‌లో హోమ్‌గార్డ్ అవ్వాలని మహిళ అభ్యర్థి సంకల్పం
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో జిల్లాలో జరుగుతున్న హోమ్‌గార్డ్ నియామక పరీక్షల్లో (Home Guard Recruitment) ఒక మహిళా అభ్యర్థి అసాధారణ సంకల్పం ప్రదర్శించారు.
సిద్ధో-కాన్హూ మైదానంలో జరిగిన 1600 మీటర్ల (1 మైల్) శారీరక సామర్థ్య పరీక్షలో ఆమె సాంప్రదాయ చీర ధరించి, ఎలాంటి పాదరక్షలు లేకపోయినా పరుగు పూర్తి చేసింది.
రామ్‌గఢ్‌లో మొత్తం 284 హోమ్‌గార్డ్ పోస్టులకు నియామకాలు జరుగుతుండగా, మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉంది.
క్రీడా దుస్తులు, బూట్లు లేకపోయినా, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఆమె చీర పల్లును సర్దుకుని ట్రాక్‌పై పరుగెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
