Published:
Updated: 11 Sep 2024 • 09:32 AM
ఆకేరున్యూస్, హన్మకొండ: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 13వ తేదీ శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. 18నుంచి 35ఏళ్ల లోపు వయస్సు కలిగి ఇంటర్, గ్రడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పారు. హన్మకొండ ములుగురోడ్ లోని ఐటీఐ బాలుర కళాశాల క్యాంపస్ లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 7893394393 నంబర్లో సంప్రదించాలని చెప్పారు.
————————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
