Kadiyam Srihari
* స్టేషన్ ఘన్‌పూర్‌లో కలకలం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కులం పేరుతో దూషిస్తూ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎస్సై బి. వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన వ్యాపారి ఎర్రం శీను ఎమ్మెల్యేను దూషించిన ఆడియోను వైరల్ చేశాడని ఇందిరానగర్‌కు చెందిన తోకల రాజు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పలువురిపై వ్యాఖ్యలు
ఎర్రం శీను మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో మంగళవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు, స్థానిక వ్యాపారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
