Tatvam
Tatvam| ఆకేరు న్యూస్, సినిమా: దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తత్వం. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ బ్యానర్లపై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రమోషన్స్ ప్రారంభించిన సమయంలో హీరో దినేష్ తేజ్, హీరోయిన్ దష్విక కారు ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. దీంతో వారు కోలుకునేందుకు సమయం పట్టడంతో సినిమా ప్రమోషన్స్, విడుదలలో జాప్యం జరిగిందన్నారు.
ప్రస్తుతం దాదాపు డజను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. తమ కథ, కంటెంట్‌పై నమ్మకంతో అక్టోబర్ 2న ‘తత్వం’ను విడుదల చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమా పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, అక్టోబర్ 2న సక్సెస్ సెలబ్రేషన్స్‌తో తమ కష్టాలన్నీ మరిచిపోతామని పేర్కొన్నారు.
నిర్మాత శీమకుర్తి వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. వెండితెరపై సినిమాను చూసి ప్రేక్షకుల ఆదరణ పొందినప్పుడు తమ కష్టాలన్నీ మరిచిపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దినేష్ తేజ్, హీరోయిన్ దష్విక, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
