Padmashali Sangham State Committee
ఆకేరు న్యూస్, కమలాపూర్:
పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గంలో కమలాపూర్‌కు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. నిన్న హనుమకొండలోని వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్ చేతుల మీదుగా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కార్యదర్శిగా తవుటం రవీందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ పాత్రికేయులు పులికంటి రాజేందర్, రాష్ట్ర ఈసీ మెంబర్ గా బొప్ప శివశంకర్ ఎన్నికయ్యారు. గ్రామస్థాయి నుంచి పద్మశాలి సంఘాల అభివృద్ధికి, అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన నాయకులు అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొప్పెరి వెంకట హరికిషన్, మేకల జనార్ధన్‌లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
