Kothapalli Naseem Class 10 Results
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పదవ తరగతి వార్షిక పరీక్షలో 502 మార్కులు సాధించిన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి.నసీం అనే విద్యార్థిని గ్రామ సర్పంచ్ ముక్కెర స్వరూప రవిలు మంగళవారం సత్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో తల్లిదండ్రులు సల్మా మసీద్ అలీ నసీంను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవిందు ఇస్సాక్, వార్డు సభ్యులు, కార్యదర్శి కుమారస్వామి విద్యార్థి తల్లిదండ్రులు సల్మా మసీద్ అలీ, అంగన్వాడి టీచర్లు రజిత, రేణుక ఆశ వర్కర్లు పద్మ,శామల ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.
