ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ ట్వీట్ చేశారు. అలాగే విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని తెలిపారు. వారు కోరితే మీ బర్త్‌డే కేక్ కూడా కట్ చేయిస్తానని తెలిపారు. కాగా, అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ న్యూస్‌పేపర్ రాసుకొచ్చిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ చేసిన ట్వీట్‌ను ఆయన కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కేటీఆర్ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఇదంతా చేస్తున్నారని మాకు తెలుసని, జర్నలిజాన్ని జోక్‌గా మార్చవద్దంటూ క్రిషాంక్ అందులో పేర్కొన్నారు.
……………………………….