Chakali Ilamma Death Anniversary
* నివాళులర్పించిన కూడా ఛైర్పర్సన్
* పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆకేరు న్యూస్, వరంగల్ : వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్పర్సన్ గుండు సుధారాణి కొనియాడారు. గురువారం హనుమకొండలోని న్యూ శాయంపేట జంక్షన్లో ఉన్న చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్పర్సన్ గుండు సుధారాణితో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్య శారద, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

* హక్కుల కోసం ధైర్యంగా పోరాడారు..
కుడా ఛైర్పర్సన్ సుధారాణి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ కేవలం ఒక వర్గానికి పరిమితమైన మహిళ కాదని, రైతులు, పేదలు, సమస్త అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె పోరాటం మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి మరియు సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందని గుర్తుచేశారు.

* కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, సామాజిక న్యాయం, సంక్షేమం మరియు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని సుధారాణి తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం నిరంతరం చేయూతనిస్తోందన్నారు. అమరులు, పోరాటయోధుల త్యాగాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
* పాల్గొన్న అధికారులు, నాయకులు..
ఈ వర్ధంతి వేడుకల్లో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్. రవి, వై.వి. గణేష్, ఎల్. కిషోర్ కుమార్, వరంగల్ ఆర్డీవో సుమ, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పుష్పలత, లక్ష్మణ్, మత్స్య శాఖ అధికారి శ్రీపతి, డాక్టర్ మధుచందర్, మాజీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ చీకటి ఆనంద్, మున్సిపల్, కుడా అధికారులు మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
