* మనవరాలి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో మాజీమంత్రి మల్లారెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి వచ్చి. తన మనమరాలి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. పెళ్లి పత్రిక ఇచ్చేందుకు రేవంత్ ఇంటికి వచ్చానని స్పష్టం చేశారు. అంతే తప్ప ఇతర కారణం ఏదీ లేదని తేల్చి చెప్పారు. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
…………………………………..