* నెలాఖరు వరకు గడువు పెంపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. సాంకేతిక సమస్యల (TECHNICAL PROBLEMS) కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో దరఖాస్తు చేసుకోలేకోపోయామని పలువురు ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2020లో ప్రారంభమైన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులొచ్చాయి. అయితే 5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్ 30 నాటికి చెల్లింపులు పూర్తి చేశారు. నెలాఖరు వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఎంత మంది ఫీజులు చెల్లిస్తారనేది వేచి చూడాలి.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
