-
రాత్రి 8.30 గంటల విమానంలో ఢిల్లీ కి తరలించనున్న ఈడీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్ట్ (MLC Kavitha Arrest) చేశారు. ఈ రోజు రాత్రి 8. 30 గంటల విమానంలో ఢిల్లీ కి తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత నిందితురాలిగా ఉన్నారు. శుక్రవారం మద్యాహ్నం నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 8 మంది అధికారులు బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు.. కేటీఆర్, హరీష్ రావు, బాల్క సుమన్ ,ప్రశాంత్ రెడ్డి తదితరులు కవిత ఇంటికి వచ్చారు. సుప్రీంకోర్టు లో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కవితను ఏ విదంగా అరెస్ట్ చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.. ఇవేమి పట్టించుకోకుండా ఈడీ అధికారులు ,స్థానిక పోలిస్ ల సహకారంతో ఢిల్లీ కి కవితను తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
