Warangal MP Pasunuri Dayakar : వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశారని ఆయన కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేసీఆర్ ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.
కాాగా, రేవంత్ రెడ్డి, పసునూరి దయాకర్ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఒకేసారి లోక్‌సభ లో ఎంపీగా పనిచేశారు. రేవంత్‌తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా ఉపయోగపడుతుందన్న భావనతోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి కొండా సురేఖతో చర్చల తర్వాత సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలుసుకున్నారు. దీనిద్వారా కాంగ్రెస్ లో తాను చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా దయాకర్ సంకేతాలు పంపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
