Mulugu Anti Drug Rally
* మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ములుగు జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ.
ఆకేరు న్యూస్, ములుగు:
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీస్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్స్ అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత లు ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మూలమలుపు నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్ , ములుగు డి.ఎస్.పి రవీందర్, పస్ర సిఐ దయాకర్, ములుగు సీఐ సురేష్, ఎస్సై లు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
