* రేవంత్ ను చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి
* సురేందర్ రెడ్డిది ప్రభుత్వ హత్యే
* 9 నెలల్లో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
* మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) ఎన్నికల ముందు ఓ మాట.. కుర్చీ ఎక్కాక మరోమాట చెబుతున్నారని, ఊసరవెల్లులు కూడా ఆయనను చూసి సిగ్గుపడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు(EX MINISTER HARISHRAO) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల కాలంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డి(SURESH REDDY)ది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తెలంగాణభవన్(TELANGAN BHAVAN)లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంక్ పాస్ బుక్ మీదనే సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, నా చావుకు కారణం క్రాప్ లోన్ మాఫీ కాకపోవడం. నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు… అని స్పష్టంగా పేర్కొన్నాడని తెలిపారు. తల్లి, సురేందర్ రెడ్డి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్లే ఆయనకు రుణమాఫీ కాదని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో తీవ్ర ఆవేదనతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్‌రావు తెలిపారు. లక్షా 10 వేలు రుణం కట్టాలని కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడి సురేందర్ రెడ్డి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని, చివరకు మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరేసుకుని చనిపోయారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్ సాక్షిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. పంద్రాగస్టు నాడు రుణమాఫీ అయిపోయిందని చెప్పావు..? అయిపోతే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అని ప్రశ్నించారు. సురేందర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్.. రేవంత్ రెడ్డి దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామాగా హరీశ్‌రావు (HARISH RAO)అభివర్ణించారు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
