* పెరుగుతున్న బట్టతల సమస్యలు
* మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులే కారణం
* సమస్యలు తగ్గాలంటే మారాల్సిందే
ఆకేరున్యూస్, హైదరాబాద్ : నిర్ణీత వేళలో, నిర్ణీత సమయానికి నిద్ర పోకపోతే ఆరోగ్య సమస్యలే కాదు.. జుట్టు కూడా రాలిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఇతర కారణాలతో బట్టతల ఇబ్బందులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే, రోజుకు వంద వెంట్రుకల వరకూ ఊడడం సాధారణమేనని, అంతకుమించి లాసయితే, హెయిర్ ఫాల్గా భావించాలని డాక్టర్ అశ్విని గుత్తేదార్ వెల్లడించారు. జుట్టు ఊడడంలోనూ నాలుగు దశలు ఉంటాయని, అవి అయజెన్, కేటజెన్, టెలిజన్, ఎక్సోజన్ గా వివరించారు. మనిషి యవ్వనం, వృద్దాప్యం, మరణంలాగే జుట్టు కూడా ఎదుగుతుందని, కాలక్రమేనా రాలుతుందని తెలిపారు. వందకు మించి ఊడుతుందంటే.. అందుకు స్ట్రెస్, సరైన ఫుడ్ లేకపోవడం, కోవిడ్ తర్వాత తలెత్తిన కారణాలుగా వివరించారు. మహిళల్లో సరైన మోతాదులో హెమొగ్లోబిన్ లేకపోవడం, థైరాయిడ్, పీసీఓడీ ఇవన్నీ.. జుట్టు ఊడిపోవడానికి కారణాలుగా ఉంటున్నాయని వెల్లడించారు.

సరైన నిద్ర లేకపోవడం.. అతి బరువు
సరైన నిద్ర లేకపోవడం, అతి బరువుతో జుట్టు వెంట్రుకలు రాలిపోతాయని డాక్టర్ అశ్విని హెచ్చరించారు. ఊడడానికి ముందే జాగ్రత్తలు పాటించడం మేలని అన్నారు. సరైన జీవన శైలి, హై ప్రొటీన్ డైట్, బయట ఫుడ్ మానేయడం, మైదా ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా జుట్టు ఊడడాన్ని అరికట్టవచ్చు అన్నారు. దీంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అన్నారు. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతుందని, అందువల్ల జుట్టు ఎక్కువగా ఊడుతుందని తెలిపారు. అలాగే, కూర్చుని కదలకుండా పనిచేయడం వల్ల బరువు పెరుగుతారని, బాడీకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు.
ఆడవాళ్లలోనూ బట్టతల..

పీసీఓడీ, థైరాయిడ్ తదితర కారణాల వల్ల ఆడవారిలో బట్టతల సమస్యలు పెరుగుతున్నాయని అశ్విని తెలిపారు. మగవారిలో సాధారణంగా వంశపారంపర్యంగా బట్టతల రావొచ్చని, తండ్రికి ఉంటే 40 నుంచి 50 ఏళ్లలో కుమారుడికి, ఆ తర్వాత వారసత్వానికి 20 నుంచి 30 ఏళ్లకే బట్టతల రావడానికి కారణం జీవనశైలిలో మార్పులే కారణమన్నారు. ఇటీవలి కాలంలో ఆడవాళ్లలో కూడా బట్టతల సమస్యలు పెరగడం చూస్తున్నామని వివరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
