ఓటు వేసిన రాష్ట్రపతి ముర్ము
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆరో దశలో ఎన్నికల పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సాధారణ ఓటర్లతో పాటు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
